నేడు బూర్జువా నాయకులు తమ ప్రభావంలో ఉన్నప్రాంతం వరకు విడిగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాగయితే ఆ ప్రాంతానికి తామే రాజులు కావచ్చని కలలు కంటున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వరకు పట్టు ఉన్న నాయకులకు ప్రత్యేక గ్రేటర్ హైదరాబాద్ కావాలి. తెలంగాణ వరకు పట్టు ఉన్న నాయకులకు ప్రత్యేక తెలంగాణ కావలి. ఆంధ్రప్రదేశ్ వరకు పట్టు ఉన్న నాయకులకు 'సమైక్యాంద్ర ' కావాలి.
ఆంధ్ర ప్రదేశ్ మొత్తం పట్టు ఉన్న వాళ్ళు రాష్ట్రం విడిపోటానికి ఒప్పుకోరు. తెలంగాణ రాష్టం ఏర్పడిన తరువాత ఒకవేళ ఆదిలాబాద్ వాళ్ళో లేక మహబూబ్ నగర్ వాళ్ళో విడిపోతామంటే, ఇప్పటి తెలంగాణ వేర్పాటు వాదులు అప్పుడు సమైక్య వాదులవుతారు. ప్రత్యేక హైదరాబాద్ నిస్తూ పాత MCH పరిధుల వరకే ఇస్తామంటే, గ్రేటర్ హైదరాబాద్ వేర్పాటు వాదులు అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సమైక్య వాదులవుతారు.
అందరూ ప్రాంతీయ వాదులే. తమ అవసరాలకు అనుగుణంగా సమైక్య వాదులుగా పోజు పెట్టాల్సి వస్తుంది.
(హిందూ మతోన్మాదులు కూడా కులోన్మాదం వద్దంటారు. అన్ని కులాలు ఐక్యంగా ఉండాలి, మతం విషయంలో మాత్రం ఐక్యత వద్దంటారు.)
Friday, December 11, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment